ఎన్టీఆర్ మంచి నాయకుడే అవుతాడు కానీ…లోకేశ్‌కి ఆ సత్తా లేదు…

Share Icons:
హైదరాబాద్, 17 జూన్:

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి… తాజాగా ఒక ప్రముఖ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎప్పటికి కూడా చంద్రబాబే టీడీపీని సమర్థవంతంగా నడిపించగలడని, ఆయన కుమారుడు లోకేశ్‌కి పార్టీ బాధ్యతలు అప్పగించడం వృధా అని జేసీ అన్నారు…ఇకపోతే ఒకవేళ టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ టీడీపీ అధికార బాధ్యతలు చేపట్టాలని, లేకపోతే టీడీపీకి భవిష్యత్ ఉండదని రాజకీయ విశ్లేషకులు అన్నటువంటి మాటలపైనా స్పందించినటువంటి జేసీ… ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే కొన్నేళ్ళకు మంచి నాయకుడు అవ్వోచ్చేమో కానీ ఇప్పుడే తనకు అంత రాజకీయ అనుభవం లేదని జేసీ అన్నారు.

అంతేకాకుండా “పవన్ కల్యాణ్ అంతటివాడికి కూడా రాజకీయాలు సరిపడవని చెప్పానని, పవన్‌కు ఎంత పేరుంది? మిమ్మల్ని చూడ్డానికి జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పానని అన్నారు.

చిరంజీవి, రోజా ఇలా ఎంతోమంది సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, తెరపై నటించే ఆ నటులను చూడ్డానికి జనం వస్తారే తప్ప వాళ్లను రాజకీయంగా ఆమోదించడం చాలా కష్టం”అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

 

Leave a Reply