కదులుతున్న పునాదులు

Poll 35 on politicians vs police
Share Icons:

 

ప్రజాస్వామ్యం అన్న భవనం నాలుగు ప్రధానమాన ములస్థంభాలపై వర్థిల్లుతోంది. కానీ బయటికి మూడు సింహాలే కనిపిస్తున్నా, ఆ కనిపించని నాలుగో సింహమే పోలీస్.

 

[pinpoll id=”62705″]

 

పవిత్రమైన ప్రజాస్వామ్య ఆలయంలో ప్రజాప్రతినిధులు పూజారులైతే, పోలీసులు ఆ ప్రజల రక్షకులు కదా, మరి గత వారంలో తాడిపత్రిలో జరుగుతున్న వ్యవహారంలో ఇరువురు పరస్పరం మాటల యుద్దం మొదలు పెట్టారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నాలుకలు కోస్తా అని పోలీసు సంఘం పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధి, సీనియర్ నేత ఎంపీ ని హెచ్చరిస్తే, ఆయన మాత్రం తక్కువ తిన్నారా,  ఖాకీ బట్టలు తీసేసి రారా చూసుకుందాం నువ్వు గొప్పో, నేను గొప్పో, టైం చెప్పు, ప్లేస్ చెప్పు, నేను వస్తా అని మీడియా మీటింగులో సవాలు విసిరారు.

చాలు, ఆ మాత్రం మసాలా ఉంటే మన మీడియాకు కావలసిందేమిటి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు  వాటికి ప్రచారం కల్పించాయి. ఎవరి ఇష్టం వచ్చిన వాఖ్యలు వారివి. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు అధికారలను కొజ్జాలని ఎంపీ స్థాయి వ్యక్తి అనవచ్చా, ఆ పదం పార్లమెంటరీనా, అన్ పార్లమెంటరీనా అనే చర్చ కూడా జరిగింది. వక్తిగతమైన సభ్యత విడిచిపెట్టినపుడు ఇక ఏ పదానికీ ఏదీ వర్తించదు. కాస్త సంయమనం ఉంటే మాట నోటి గడప దాటక ముందే మరో సారి ఆలోచించి అంటాం అటువంటి పరిస్థితి ఇపుడు లేదు. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం పై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.

మామాట: ఇరువురూ  సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు.

Leave a Reply