పవన్ తో కలిసి కూటమిగా పోటీ… సీపీఎం మధు

Share Icons:

విశాఖ, జనవరి 11,

ఏ.పీ లో మరి కొన్ని మాసాల్లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో  పవన్ సారధ్యంలోని  జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు.  విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

పవన్ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని.. తమ కూటమి ద్వారా ప్రత్యామ్నాయం తీసుకువస్తామని తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై తాము చర్చించి.. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఏపీలో టీడీపీకి ప్రజల్లో మద్దతు కరువైందన్నారు. జగన్ అన్నా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.

కేంద్ర రాజకీయాలపై మాట్లాడుతూ… వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారన్నారు. అందుకనే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ను కేంద్రం చట్టం ద్వారా కల్పిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో కూటముల వల్ల ప్రయోజనం లేదని, ఫెడరల్‌ ఫ్రంట్‌ వల్ల కూడా ఉపయోగం లేదన్నారు.

మామాట: కూటమి గెలవదని అంటూ కూటమి అంటావేమి సారూ

Leave a Reply