కాకినాడకు పవన్..పర్మిషన్ లేదంటున్న పోలీసులు…వెనక్కి తగ్గని కార్యకర్తలు…

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

కాకినాడ: కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు ద్వారంపూడిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడ జనసేన కార్యకర్తలు ద్వారంపూడి క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ…ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారికి కౌంటర్ గా వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు చేరుకోవటంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న పవన్ స్పందించారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఉంటూ అనుచితంగా వ్యవహించినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇక, ఈ రోజు కార్యకర్తలను పరామర్శించి..అక్కడే పవన్ ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తల పైన దాడులు చేసిన వారి పైన చర్చలకు ఆయన డిమాండ్ చేస్తున్నారు.

పవన్‌ పర్యటన నేపథ్యంలో కాకినాడలో సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 విధించారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు పోలీసులు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు బయల్దేరారు. ఆదివారం పరిస్థితులు రిపీట్‌ అవుతాయోమోనని టెన్షన్‌ నెలకొంది. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు.

అయితే ద్వారంపూడిని అరెస్టు చేసే వరకు జనసేన శ్రేణులు ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. దీంతో..పవన్ కాకినాడ పర్య టన పైన ఉత్కంఠ నెలకొని ఉంది. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న పవన్.. కాసేపట్లో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కాకినాడ కు వచ్చి కార్యకర్తలతో సమావేవమవుతారు. మరి పవన్ సమావేశం సజావుగా జరుగుతుందో లేదో చూడాలి.

 

Leave a Reply