రాజధానిలో పవన్…రైతులకు సంఘీబావం..పోలీసులు ఆంక్షలు

Share Icons:

అమరావతి: ఇటీవలే కర్నూలు పర్యటనకు వెళ్ళి, అక్కడ సమస్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్.. రాజధాని తరలింపుపై దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు తెలపనున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆపీసు నుంచి బయలుదేరనున్న జనసేనాని.. యర్రబాలెం, పెనుమాక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పర్యటిస్తారు. ఈ పర్యటనలో దీక్ష చేస్తున్న వారితో పాటు రాజదాని రైతులకు పవన్ సంఘీభావం తెలపనున్నారు. అయితే పవన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు కాస్త ఇబ్బందిగా మారాయి.

ఇప్పటికే రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రాజధాని ప్రాంత ప్రజలకు మద్దతు తెలపాలని రాజధాని గ్రామాల్లో పర్యటించిన జనసేనాని మరోసారి రైతుల వద్దకు వెళ్తున్నారు. బీజేపీతో పొత్తు ప్రకటన చెయ్యక ముందు నాలుగు గ్రామాల్లో పర్యటించిన పవన్ ను పోలీసులు పవన్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో వారిని పరామర్శించేందుకు వెళ్లాలని పవన్ ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో అది వాయిదా పడింది.

ఇక గతంలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని గ్రామాల్లో పర్యటనకు ముందు అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్నారు పవన్. బీజేపీ, జనసేన నేతలు సంయుక్తంగా రాజధాని గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పవన్‌కు వివరించారు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత పవన్ ఇవాళ రాజధానికి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది . ఇక నేడు పవన్ టూర్ నాలుగు గ్రామాలలో ఉండనుంది. పవన్ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజధాని ప్రాంతంలోని జనసైనికులు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ టూర్ ఎలా జరుతుందనేది సస్పెన్స్ గా మారింది.

ఇక పవన్ పర్యటన నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని చెబుతున్న రూట్లలో భారీ ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. మొన్నటి వరకు తొలగిస్తూ వచ్చిన పోలీసు పికెట్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. భారీగా పోలీసులు మొహరించటంతో రాజధాని ప్రాంత గ్రామాలు మళ్ళీ టెన్షన్ వాతావరణంలోకి చేరుతున్నాయి. మరి నేడు పవన్ పర్యటన అడుగడుగునా ఆంక్షల మధ్య ఎలా సాగుతుందో వేచి చూడాలి .

 

Leave a Reply