జగన్, కేసీఆర్ లపై పవన్ విమర్శలు…

pawan kalyan sensational comments on ap people
Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల దాడి పెంచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అనేక మీద అంశాల మీద చర్చ జరిపిన పవన్….పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. ఏపీకి రావలసిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్థి ఏ విధంగా జగన్‌ ప్రభుత్వాన్ని పోలిట్ బ్యూరో ప్రశ్నించింది. కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి జగన్‌ ప్రభుత్వం తీసుకెళ్లిందని మండిపడింది. ఇసుక లభ్యత లేక రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని సమావేశంలో అభిప్రాయ పడ్డారు. అందుబాటులో ఉన్న ఇసుకను సైతం భారీ ధరలకు విక్రయిస్తుండడంతో నిర్మాణదారులు తమ నిర్మాణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు.

అదేవిధంగా రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నదని పవన్ అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా ఒకటే రాజధాని ఉంటుంది.. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అనేక రాజధానులు పెడతారా? పిల్లి కాపురంలో పిల్లల్ని ఆరు చోట్లకు మార్చిందన్న చందాన రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ చివరకు ఏమీ లేకుండా చేస్తారేమో అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. గ్రామ సచివాలయ పోస్టుల నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళాలు, నియామకాల్లో తప్పిదాల వల్ల ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయని తెలిపారు.

అటు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు జనసేన పొలిట్‌బ్యూరో మద్దతు ప్రకటించింది. సమ్మెలో పాల్గొంటున్న 48 వేల మందిని తొలగిస్తామని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన మూలంగా కార్మికుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పవన్ సూచించారు. కార్మికుల డిమాండ్లని పట్టించుకోకుండా కేసీఆర్ గుడ్డిగా వెళ్లొపోవడం కాదని విమర్శించారు. అలాగే జమ్మూకశ్మీరును జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను పొలిట్‌బ్యూరో సమర్థించింది. కాగా.. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపైనా లోతుగా చర్చించింది.

అదేవిధంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన పోటీకి సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించారు. అలాగే పార్టీ రాజకీయ వ్యవహారం కమిటీ సభ్యులని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply