TRENDING NOW

బీఎస్పీ కలిసిందిగా…తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమైంది…

బీఎస్పీ కలిసిందిగా…తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధమైంది…

హైదరాబాద్, 16 మార్చి:

మరో 25 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలసి పోటీ చేయాలని జనసేన, బీఎస్పీ నిర్ణయించాయి. సీట్ల పంపకాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయని మార్చి 15న లక్నోలో మాయావతి ప్రకటించారు. దీంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. కాగా,2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు తెలంగాణలో గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇప్పుడు బీఎస్పీ‌తో కలసి తెలంగాణలో తన సత్తా పరీక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణాల్లో జనసేన, వామపక్షాలు, బీఎస్పీ పార్టీలు పొత్తులతో ముందుకు వెళ్లనున్నాయి. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయాలనుకునే వారు జనసేనకు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. మార్చి 17వ తేదీ నుంచి జనసేన కార్యాలయంలో దరఖాస్తులు చేయవచ్చని సూచించింది. మరి ఈ పార్టీల కలయిక ఏ మేర ఓట్లు రాబట్టుకుంటాయో చూడాలి

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

మామాట: గెలవడానికా…ఓట్లు చీల్చడానికా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: