అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా టీడీపీ: జనసేన

Share Icons:

విజయవాడ, 17 అక్టోబర్:

చంద్రబాబులాగా పవన్‌ కల్యాణ్‌ దొంగ దీక్షలు చేయలేదని, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా టీడీపీ మారిందని జనసేన పార్టీ వ్యాఖ్యానించింది.

ఈరోజు విజయవాడలో జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్‌ చింతల పార్ధసారధి, జాయింట్‌ కోఆర్డినేటర్‌ పోతిన మహేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కవాతుకు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారని, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ నాయకులకు జనసేన గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లకు భజన చేయడం వలన రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదని ధ్వజమెత్తారు.

ఇక అవినీతి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గంలోనే మంచి నీళ్లు ఇ‍వ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి జవహర్‌ కొవ్వూరుతో పాటు తిరువూరులో కూడా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

మామాట: అవినీతిపై ఆరోపణలు చేయడం కంటే ఆధారాలు చూపిస్తే బాగుంటుందేమో…

Leave a Reply