పవన్‌కు షాక్ ఇస్తూ…మూడు రాజధానులకు మద్ధతు తెలిపిన రాపాక…

police case against janasena mla
Share Icons:

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరిన…ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మూడు రాజధానులకు మద్ధతు ఇచ్చారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై కూడా ప్రశంసల జల్లు కురిపించారు. అతి చిన్న వయసులోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ మంచి పాలన అందిస్తున్నారని అన్నారు.

అటు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండరని, ఇంకొక సీఎం వస్తారని అప్పుడు మళ్లీ రాజధాని మారుస్తారా? అని నిలదీశారు. చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఉంటుందా? అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా.. ప్రధాని అయినా, ముఖ్యమంత్రులు అయినా రాజధానిని మార్చారా? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు తెలిసి ఒక్క తుగ్లక్ మాత్రమే రాజధాని మార్చారని నిమ్మల రామానాయుడు అన్నారు.

అమరావతి కోసం ప్రాణాలు అర్పించిన రైతుల మృతికి సంతాపంగా సభ మౌనం పాటించాలని స్పీకర్‌ను నిమ్మల కోరారు. 13 జిల్లాల ప్రజలంతా అమరావతిని ఆమోదించారన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి యావత్ భారతదేశ రైతులు పాదాభివందనం చేస్తారని తెలిపారు. చట్టబద్ధత లేని బోస్టన్ కంపెనీ నివేదికను ఐదు కోట్ల ప్రజలపై ప్రభుత్వం రుద్దుతోందని మండిపడ్డారు. ముంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఐటీ మద్రాస్ ఆ వార్తలను ఖండించిందని పేర్కొన్నారు.

ఇక వైసీపీ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తుగ్లక్ పాలనలో రాష్ట్రం తలకిందులైన తాబేలులా తయారయ్యిందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్ర భవిష్యత్తును తీవ్ర అయోమయంలోకి నెట్టారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలి గానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని.. అమరావతిలో ఇప్పుడున్న నిర్మాణాలకు, వాటాదారులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

 

Leave a Reply