ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్: జగన్ కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..

Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. జగన్ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో మార్గదర్శకాలను సవరించింది. గతంలో ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటేనే, ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇచ్చే పథకానికి అర్హత సాధిస్తారు. అయితే, తాజాగా ఆ నిబంధనలను మార్చింది. కుటుంబంలో భార్య పేరు మీద ఆటో ఉండి.. భర్త నడుపుతున్నా కూడా అతడికి రూ.10వేలు అందిస్తారు.

కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఈ పథకం కింద లబ్ధిదారుడిగా అర్హత సాధిస్తారు. ఇద్దరి పేర్లు వేర్వేరు రేషన్ కార‌్డుల్లో ఉన్నా పథకం కింద అర్హులు అవుతారు. బ్యాంకు అకౌంట్ మాత్రం ఆటో యజమాని పేరుతోనే ఉండాలని నిబంధన విధించారు. లబ్ధిదారుడికి, ఆటో యజమానికి ఉండే బంధాన్ని గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ ధ్రువీకరించాలి. దీంతోపాటు తెల్ల రేషన్ కార్డులో పేరు లేదన్న కారణంతో తిరస్కరించిన దరఖాస్తులకు మరో అవకాశం కల్పించనున్నారు. గతంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు మరో సారి అప్లైచేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

దరఖాస్తులు ఆన్ లైన్లో అప్ లోడ్ చేసేందుకు గడువు అక్టోబర్ 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఆన్‌లైన్లో అప్లై చేసుకోలేకపోతే.. పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, వార్డ్ వాలంటీర్, గ్రామ వాలంటీర్ల వద్ద నేరుగా ఇచ్చేందుకు కూడా అవకాశం కల్పించింది. నవంబర్ 8 కల్లా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి, 10వ తేదీ వరకు అర్హులను జిల్లా కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు. నవంబర్ 15న డ్రైవర్ల ఖాతాలోకి నగదు బదిలీ చేయనున్నారు.

జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Leave a Reply