జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జనసేన నేతలు…

janasena leaders fires on jagan government
Share Icons:

అమరావతి:

ఇప్పటికే ఏపీలోని జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. వంద రోజుల్లో జగన్ పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ జగన్ పాలనపై విమర్శల వర్షం కురిపించారు. రాజధాని తరలింపు విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఈ విషయంలో మీరెందుకు స్పందించడం లేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అసలు రాజధానిపై అవగాహన లేమితో మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా జగన్ స్పందించాల్సిన విషయంలో వారు మాట్లాడుతుండడం సీఎం అసమర్థతగా భావించాల్సి వస్తోందన్నారు. అటు పరిపాలన విషయంలోనూ జగన్ చేసింది శూన్యమేనన్నారు. ఈ వంద రోజుల్లో ఏదైనా చేశామని మీకైనా అనిపిస్తోందా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చే నైతికత, అధికారం జగన్‌కు లేనేలేవని, ఇప్పటికే అక్కడ రూ.8,400 కోట్లు పెట్టుబడిగా పెట్టారని అన్నారు. కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయని నాదెండ్ల పేర్కొన్నారు.

పెట్టుబడులు పెట్టేవారిపై కేసులుపెట్టి భయపెట్టడం ఎక్కడి సంస్కృతో చెప్పాలని జగన్‌ను నిలదీసిన మనోహర….రైతులు తమ భూములు ఇచ్చింది పార్టీ కోసం కాదని, రాజధాని కోసం ఇచ్చారన్న సంగతిని మర్చిపోవద్దన్నారు. భూములిచ్చి తాము చేసిన త్యాగం వృథా అవుతుంటే వారు బాధతో కుమిలిపోతున్నారని అన్నారు. ప్రజల కోసం జనసేన అధినేత పవన్ త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్టు మనోహర్ తెలిపారు.

గతంలో అమరావతి పై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. బొత్సను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇక పవన్ మీద అప్పటినుంచి తన వ్యాఖ్యలతో ఎదురుదాడి చేస్తున్నారు బొత్స సత్యనారాయణ. ఇక బొత్స తాజా వ్యాఖ్యలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరక్కుండా చూడమని రైతుల తరపున జనసేనాని సూచనలు ఇస్తే చంద్రబాబు రాజకీయ బినామీ అంటూ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. అధికారంలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటానికి సిగ్గు పడాలి మీరు అంటూ చాలా ఘాటుగా స్పందించారు.

రాజధాని అంశంలో జరుగుతున్న అవకతవకలపై తొలిసారి ప్రశ్నించి రైతుల తరపున టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించింది జనసేన అని, అది మీరు గుర్తుంచుకోవాలని మంత్రి బొత్సాకు హితవు పలికారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక కూడా తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి అని హెచ్చరించింది కూడా జనసేనే అని చెప్పుకొచ్చారు.

Leave a Reply