వైసీపీ నేతలకు రాజధాని రైతులు చేసే సన్మానం చూడాలని ఉంది….

Share Icons:

హైదరాబాద్: రాజధాని అమరావతిలో చేస్తున్న రైతుల ఆందోళనలపైన జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పు బడుతూ నాగబాబు ట్వీట్ చేసారు. అందులో… రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వారి గదుల్లో కాకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలన్నారు. అప్పుడు వారికి రైతులు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందని ట్వీట్ చేశారు.

ఇక హిట్టర్ అంశాన్ని ప్రస్తావించిన నాగబాబు.. ఆయన కన్నా గొప్ప వాళ్లు ఎవరూ లేరని..అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడని గుర్తు చేసారు. దీనికి కొనసాగింపుగా జగన్ రెడ్డి గారు ఆ తప్పు చేయండి..యు హావ్ స్టిల్ టైం యు కరెక్ట్ యువర్ హాస్టీ డెసిషన్ అని పోస్టింగ్ చేసారు.

అదే విధంగా..రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయమని నాగబాబు ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకమని…మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంటూ నాగబాబు ట్వీట్ చేసారు. మరో ట్వీట్ లో.. మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నానని… గుడి కి వెళ్తున్న వారి మీద లాఠీచార్జి చేస్తున్నారని న్యూస్ లో చెప్తున్నారు.అదే నిజమైతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు..అంటూ నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు. మనుషుల్లోనే మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని… కులాల మీద పగబట్టి, వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని ట్వీట్ చేశారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతానికి చెందిన నెత్తురోడుతున్న ఓ మహిళ ఫొటోను షేర్ చేశారు.

కాగా, అమరావతి రైతులకు మద్దతుగా ఇప్పటికే నాగబాబు..నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. పవన్ సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇక, వారికి మద్దతుగా కవాతు నిర్వహణ పైన జనసేనాని కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

Leave a Reply