మీ విక్టరీని మీ ఎమ్మెల్యేలే నాశనం చేస్తున్నారు…

Share Icons:

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…  ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన’ అంటూ జనసేన నేత నాగబాబు ట్వీట్లు చేశారు. ‘దయచేసి మీ తప్పులను సరిదిద్దుకుని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండి. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి’ అని పేర్కొన్నారు.

‘మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు ఇప్పటికీ సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము కోరుకోము. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోండి.. మీ విక్టరీని వారు నాశనం చేస్తారు. మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి. రాష్ట్ర ప్రజలందరినీ ఒకేలా చూస్తూ వారిని ప్రేమించండి.. కనీసం మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండడానికి ప్రయత్నించండి’ అని నాగబాబు చెప్పారు.

బాబు బ్యాచ్ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘2014-19 మధ్య 20 సార్లు తాము పొడిగించిన పీడీ యాక్ట్ ను, ఇప్పుడు రొటీన్ గా మా ప్రభుత్వం పొడిగిస్తే.. బాబు, ఆయన బ్యాచ్ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో చెప్పేందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం’ అంటూ ఇందుకు సంబంధించిన పత్రాలను పోస్టు చేశారు.

’10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత? డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

Leave a Reply