ఆపరేషన్ కమలం: బీజేపీలోకి జనసేన నేత…?

Share Icons:

అమరావతి, 21 జూన్:

తాజా ఎన్నికల్లో ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ పార్టీ….2024 ఎన్నికల నాటికి బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలోని ఓటమితో కుంగిపోయిన టీడీపీ నేతలనీ తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలని లాక్కున్న బీజేపీ…మరి కొందరు నేతలని కూడా లాగేసుందుకు స్కెచ్ వేస్తోంది. అయితే టీడీపీతో పాటు జనసేన నాయకులని కూడా బీజేపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ… జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో విభేదాల కారణంగా ఆయన బీజేపీని వీడారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడంతో… ఇక ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ… తిరిగి బీజేపీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో పవన్ ఓటమిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను పోటీ చేసిన రెండుచోట్ల ఓడించేందుకు కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణలు చేశారు.

పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓడిపోవడం అనేది దారుణమన్నారు. పవన్ ను ఓడించడానికి రూ.150 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసి ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రూ.150 కోట్లని చెప్పాడు కానీ, అంతకంటే ఎక్కువే ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహంతో పాటు అధికార దుర్వినియోగం కూడా జరిగిందని ఆరోపించారు.

 

Leave a Reply