మతమార్పిడి వ్యాఖ్యలు: పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జనసేన నేత

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

అమరావతి: ఇటీవల విజయవాడ దుర్గ గుడి సమీపంలోని పున్నమి ఘాట్ లో మత మార్పుడులు జరిగాయని, వీటిపై ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యల పై సొంత పార్టీ నేత, ఏపీ క్రైస్తవుల సంఘం నాయకుడు అలివర్ రాయ్ సీరియస్ అయ్యాడు. ఈ విషయంపై స్పందించి, పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేశాయని అలివర్ రాయ్ తెలిపారు. పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరిగాయని పవన్ కల్యాణ్ అన్నారని, ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలు చెలరేగేలా ఉన్నాయని విమర్శించారు. తన వ్యాఖ్యలను పవన్ వెంటనే వెనక్కి తీసుకుంటారని తాము భావించామని, అయితే, ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వివరించారు. దీంతో  పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, త్వరలో పోలీసు కమిషనర్‌ను కలుస్తామని చెప్పారు.

పవన్ పై విజయసాయి రెడ్డి సెటైర్…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండటం దురదృష్టం’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, గతంలో అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో పవన్ మాట్లాడుతూ… విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. తన అక్క రోడ్డు మీద వెళుతుంటే కొందరు ఏడిపించారని, అప్పుడు తనకు వాళ్లను కత్తితో పొడిచి చంపేద్దామన్నంత కోపం వచ్చిందని ఆయన చెప్పారు.

 

Leave a Reply