జనసేనకు హీరో నితిన్ విరాళం…?

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 09,

పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే హీరో నితిన్… తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఫేవరేట్ హీరోకు చేతనైన సాయం చేశాడు. పవన్ కల్యాన్ జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. దీంతో ఆయనకు ఎన్నికల ఖర్చు నిమిత్తి నితిన్ విరాళం అందించాడు. తన తరపున రూ.25 లక్షలు డొనేషన్ ఇచ్చాడు.

సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని.. నితిన్ తండ్రి, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి కలిసి చెక్ అందచేశారు. డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు లోనైన పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

నితిన్‌కు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుకే తన సినిమా ఆడియో ఫంక్షన్లకు.. ప్రిరిలీజ్ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా పవన్‌నే ఆహ్వానిస్తుంటాడు నితిన్. పవన్ పాటల్ని కూడా తన సినిమిల్లో రిమేక్ చేస్తుంటాడు. ఈసారి పవన్ కల్యాణ్ పార్టీకి కూడా ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 25లక్షల చెక్ అందించాడు నితిన్

మామాట: ఆలీ ఏ కాదు నితిన్ లాంటి వారూ ఉంటారుగా పవన్ జీ

Leave a Reply