జనసేన ప్రభావం రేవంత్‌పై ఉంటుందా?

Share Icons:

హైదరాబాద్, 4 ఏప్రిల్:

అన్నీ రాష్ట్రాల ప్రజలు కలిసుండే మల్కాజిగిరి పార్లమెంట్‌లో ఈ సారి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, జనసేన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది. కానీ అసలు పోరు మాత్రం కాంగ్రెస్-టీఆర్ఎస్‌ల మధ్య ఉండనుంది.

అయితే మల్కాజిగిరిలో జరిగిన తొలి ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచింది. మలి ఎన్నికలో ఓడిపోయింది. ఈసారి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది. ఇక్కడ కాంగ్రె్‌సకు బలమైన కేడర్‌ ఉంది. గత ఎన్నికల వరకూ టీడీపీకి కంచుకోట. దాంతో, రేవంత్‌ నియోజకవర్గ పరిధిలోని ఆ రెండు పార్టీల కీలక నేతలను కలుస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కలిసి పని చేసిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. దేవేందర్‌ గౌడ్‌, గద్దర్‌, కోదండరాం తదితరులను కలిసి మద్ధతు తీసుకున్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటిన…పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్తితి కనపడటంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి మద్ధతు తెలిపిన ఆంధ్రా ఓటర్లు..ఇప్పుడు రేవంత్‌ వైపు చూస్తున్నారు. కానీ జనసేన పోటీ చేయడం వలన తెలంగాణ ఆంధ్రుల ఓట్లను చీల్చే అవకాశం కనపడుతుంది. కానీ రేవంత్ దీనికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూలలో పవన్‌పై పాజిటివ్‌గా మాట్లాడటం వలన..పార్లమెంట్ పరిధిలో ఉండే కాపు ఓట్లు రేవంత్‌కి పడే అవకాశం ఉంది. పైగా జనసేనకి గెలిచే అంత కెపాసిటీ లేదనే చెప్పాలి. దీంతో ఓటు వెస్ట్ కాకుండా…రేవంత్‌కే వేస్తేనే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు.

మామాట: చూద్దాం మరి రేవంత్‌కి ఏ మేర మద్ధతు వస్తుందో

Leave a Reply