విజయవాడ తూర్పుపై జనసేన ప్రభావం ఎంతవరకు…

Share Icons:

విజయవాడ, 14 మార్చి:

ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేయడంతో అన్నీ పార్టీలలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే చాలావరకు అభ్యర్ధులని ఖరారు చేసిన పార్టీలు… ఎక్కువ పోటీ ఉన్న స్థానాల్లో జాగ్రత్తగా చూసి అభ్యర్ధులని ఎంపిక చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో ప్రధాన పోరు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల వీరికి జనసేన గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పులో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది.

విజయవాడ తూర్పు నుండి గత ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ నుండి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉన్న రామ్మోహన్‌కి ఈసారి గెలుపు అంత సులువు కాదనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన జనసేన ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తోంది. అలాగే టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకిత కూడా ఉంది.

అటు వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఇక్కడి నుంచి గెలిచారు. దీంతో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ర‌వికి మంచి ప‌ట్టు ఉంది. ఇటు జనసేన పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో కొంత పట్టు ఉంది. కాని క్యాండెట్ ఎవరు అనేది సస్పెన్స్‌గా ఉంది. ఇక్కడకాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు సుమారు 60 వేల‌కు పైగా ఉన్నారు. ఆపైగా 2009లో ప్రజారాజ్యం ఇక్కడ నుండి గెలుపొందింది. కాబట్టి జ‌న‌సేన నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టిన‌ట్లయితే గెలుపు ఖాయ‌మ‌ని అంచ‌నాలు ఆ పార్టీ నాయ‌కులు వేస్తున్నారు.  మొత్తానికి ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఖాయమే..

మామాట: మరి జనసేన ప్రభావం ఎంత ఉందో ఎన్నికల్లో తెలుస్తుంది

Leave a Reply