కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన జానారెడ్డి….

Share Icons:

హైదరాబాద్, 8 సెప్టెంబర్:

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిన్న హుస్నామాద్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి సవాల్ విసిరారని… ఆ సవాల్ ను స్వీకరించి టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

ఈనేపథ్యంలోనే కేసీఆర్‌కు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ అసత్య ప్రచారాలతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కేసీఆర్ అన్న మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాని, ఒకవేళ గులాబీ కండువా కప్పుకుంటా అని అసెంబ్లీలో అన్నట్లుగా నిరూపిస్తే 24 గంటల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే అన్నమాట ప్రకారం నడుచుకుంటానని అన్నారు.

అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను రికార్డుల నుండి బయటకి తీసి ప్రజలముందుంచాలని జానారెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

మామాట: సవాళ్ళు..ప్రతి సవాళ్ళతో హోరెత్తుతున్న తెలంగాణ రాజకీయం……

Leave a Reply