చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ ఏం చేస్తున్నారంటే…

Janareddy fires on cm kcr
Share Icons:

హైదరాబాద్, 9 నవంబర్:

చంద్రబాబుని బూచిగా చూపి కేసీఆర్ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ తన స్వార్థ రాజకీయం కోసమే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. కూటమిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని, మూడో కూటమి అంటూ కేసీఆర్ దేశమంతా ఎందుకు తిరిగారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగే పనులు చేయబోమని జానారెడ్డి స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరగదని, వారికి గతంలో ఇచ్చిన సీట్లే కేటాయించామని అన్నారు. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని, ఆయన వచ్చాక శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

దేశ అవసరాల దృష్ట్యా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, పొత్తుల అంశంపై చంద్రబాబే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారని అన్నారు. పొత్తుల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని, పార్టీలు తమకు కావాల్సిన సీట్లను అడిగాయని, టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3-4 సీట్లు ఇస్తామని జానారెడ్డి తెలిపారు. అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య టికెట్‌కు లైన్‌ క్లియర్ చేశామని జానారెడ్డి తెలిపారు.

మామాట: మరి మీరు బాబుతో కలవడం కేసీఆర్‌కి కలిసొస్తుందో లేదో….

Leave a Reply