అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘జై లవకుశ’

Share Icons:

బుచీయోన్, 21 జూలై:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 కోట్ల షేర్‌ని రాబట్టి దుమ్ములేపింది. అలా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న జై లవకుశ సినిమా అరుదైన గౌరవాన్ని సంపాదించుకుంది.

ఉత్తర కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు రోజుల ప్రదర్శనకి గాను ‘జై లవ కుశ’ సినిమాను ఎంపిక చేశారు.

ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో చోటు దక్కించుకున్న జై లవకుశ చిత్రం ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది.

ఎన్టీఆర్ కెరీర్లోనే ఇంతవరకు చేయని విధంగా డిఫరెంట్ లుక్స్ తో మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఇక అందులోనూ మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడం, పాత్రల్లోని వైవిధ్యం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బాబీ టేకింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక భారతీయ సినిమాల్లో జై లవకుశ చిత్రంతో పాటు సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, విజయ్ ‘మెర్సల్’ అమీర్ ఖాన్ ‘సీక్రెట్ సూపర్ స్టార్’, దివంగత నటి శ్రీదేవి ‘మామ్’, పృధ్వీ రాజకుమార్ ‘ఎజ్రా’ సినిమాలు ఎంపికయ్యాయి.

మామాట: తెలుగు సినిమాకి ఇది అరుదైన గౌరవమే…

Leave a Reply