మల్కాజిగిరి సహ ఆ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది…

Share Icons:

హైదరాబాద్, 17 మే:

మరో ఆరు రోజుల్లో అనగా మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో కనీసం 6-7 స్థానాలు అయిన గెలుస్తామని చూస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 5 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీవేనని జగ్గారెడ్డి ధీమావ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (మల్కాజ్‌గిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), రేణుకా చౌదరి (ఖమ్మం), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) గెలుపు ఖాయమని స్పష్టంచేశారు.

ఇక వీరిలో రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌‌కి కేంద్రమంత్రి పదవులు వస్తాయని చెప్పారు. లోక్‌సభ ఫలితాలు ఎలా ఉన్నా..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డే ఉండాలన్నారు.

మామాట: చూద్దాం మరి జగ్గారెడ్డి ధీమా ఎంతవరకు నిజమవుతుందో

Leave a Reply