కొన్ని కారణాల వల్ల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నేను లేను…..

jagapatibabu out from mahesh babu sarileru nikevvaru
Share Icons:

హైదరాబాద్:

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి జగపతిబాబు తప్పుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దీనిపై జగపతిబాబు స్పందించారు.

 

సినిమా ఇండ‌స్ట్రీ అనేది నా ఫ్యామిలీ లాంటిది.. నా ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ అయితే తప్పలేదు. గత 33 ఏళ్లుగా నేను ఇలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే తొలిసారి. ఇంతకీ విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి, మహేష్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి నేను తప్పుకున్నట్టు రకరకాల పుకార్లు వస్తున్నాయి. అవి నిజం కాదు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నా క్యారెక్టర్ చాలా ఇష్టం. నా క్యారెక్టర్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నా. ఆ సినిమాకోసం నేను కొన్ని సినిమాలు వదులు కోవడం నిజమే కాని.. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పవు. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి కొన్ని సందర్భాల వల్ల ఆ సినిమాలో నేను లేను. మొత్తానికి ఆ సినిమా నేను మిస్ అయ్యా. ఆల్ ది బెస్ట్ యూనిట్’ అని జ‌గ‌ప‌తి బాబు వీడియోలో తెలిపారు.

 

ఇక ‘అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. మీపై ప్రేమ‌, గౌరవం ఎప్ప‌టికి ఉంటుంది’ అని మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. అలాగే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ.. జ‌గ‌ప‌తి బాబు గారికి చిత్రంలో క్యారెక్ట‌ర్ చాలా న‌చ్చింది. ఆయ‌న ప్రాజెక్ట్ నుండి వెళ్ళ‌లేదు. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆయ‌న సినిమాలో భాగం కాలేక‌పోయారు. ఆయ‌న‌తో త్వ‌ర‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాం అని అనిల్ పేర్కొన్నాడు.

Leave a Reply