జగనే సీఎం- నాగన్న సర్వే!

Share Icons:

 హైదరాబాద్, ఏప్రిల్ 15,

తెలంగాణ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్తైన వెంట‌నే విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్‌లో నాగ‌న్న స‌ర్వే ఒక‌టి. అంత‌కు ముందు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో హంగ్ వ‌స్తుంద‌ని అంద‌రూ అన్న‌ప్పుడు టీఆర్ఎస్‌కు 98 నుంచి 100 సీట్లు వ‌స్తాయ‌ని క‌చ్చిత‌త్వ‌మైన స‌ర్వేను చెప్పిన వ్య‌క్తి నాగ‌న్న. ఆయ‌న తెలంగాణ‌కు సంబంధించిన‌టువంటి యువ‌కుడే. త‌న‌తోపాటు త‌న టీమ్ అంతా కూడా ఒక్కొక్క చోట ఒక‌టికి రెండుసార్లు లెక్క‌లు తీసుకుని సాంపిల్స్‌ను కూడా చూశారు. ఆ శాంపిల్స్ అన్నీ స‌క్సెస్ అయ్యాయి.

దాని త‌రువాత తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా మ‌హాకూట‌మి 6 5 నుంచి 75 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చేస్తుంది అంటూ ప‌లు స‌ర్వేలు చెప్పాయి. ఆఖ‌ర‌కు ల‌గ‌డ‌పాటి స‌ర్వే కూడా టీఆర్ఎస్ దారుణంగా ప‌త‌న‌మైపోతుంద‌ని చెప్పాయి. కానీ, అదే స‌మ‌యంలో నాగ‌న్న ఇచ్చిన స‌ర్వేల్లో టీఆర్ఎస్‌కు 88 నుంచి 93 ఎమ్మెల్యే స్థానాల‌ను క‌చ్చితంగా గెలుపొందుతుంద‌ని స‌ర్వే రిపోర్టును వెల్ల‌డించారు. అదే స‌ర్వేలో బీజేపీకి ఒక్క సీటు మాత్ర‌మే వ‌స్తుంద‌ని నాగ‌న్న చెప్పుకొచ్చారు. నాగ‌న్న చెప్పిన విధంగానే బీజేపీ ఒక్క సీటుకు మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయింది.

అటువంటి నాగ‌న్న తాజాగా ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌ర్వే చేశారు. తెలంగాణ‌లో స‌క్సెస్ అయిన నాగ‌న్న ఏపీ ఎన్నిక‌ల్లో స‌క్సెస్ అవుతారా..? లేదా..? అన్న‌ది మే 23న బ్యాలెట్ బాక్సుల్లో నుంచి వ‌చ్చే రిజ‌ల్ట్‌ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉండ‌బోతుంది. నాగ‌న్న ఇచ్చిన స‌ర్వే లెక్క‌ల ప్ర‌కారం జిల్లాల వారీగా పార్టీలు గెలుపొందే అసెంబ్లీ సీట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1) అనంత‌పురం జిల్లా
టీడీపీ : 6
వైసీపీ : 4
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 4

2) చిత్తూరు జిల్లాలో
టీడీపీ : 1
వైసీపీ : 13
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 0

3) ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో
టీడీపీ : 5
వైసీపీ : 7
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 7

4) గుంటూరు జిల్లాలో
టీడీపీ : 4
వైసీపీ : 10
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 3

5) క‌డ‌ప‌ జిల్లాలో
టీడీపీ : 1
వైసీపీ : 8
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 1

6) కృష్ణా జిల్లాలో
టీడీపీ : 12
వైసీపీ : 4
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 0

7) క‌ర్నూలు జిల్లాలో
టీడీపీ : 2
వైసీపీ : 9
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 3

8) నెల్లూరు జిల్లాలో
టీడీపీ : 0
వైసీపీ : 8
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 2

9) ప్ర‌కాశం జిల్లాలో
టీడీపీ : 1
వైసీపీ : 9
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 2

10) శ్రీ‌కాకుళం జిల్లాలో
టీడీపీ : 1
వైసీపీ : 9
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 0

11) విశాఖ‌ప‌ట్నం జిల్లాలో
టీడీపీ : 8
వైసీపీ : 5
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 2

12) విజ‌య‌న‌గ‌రం జిల్లాలో
టీడీపీ : 4
వైసీపీ : 5
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 0

13) ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో
టీడీపీ : 4
వైసీపీ : 8
టఫ్ ఫైట్ జ‌రిగే స్థానాలు : 3

మొత్తంగా..

వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 99 నుంచి 110 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంది.
తెలుగుదేశం పార్టీకి 49 నుంచి 59 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంది.

ఇరు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉన్న స్థానాలు
వైసీపీ – 12
టీడీపీ – 15

అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధ్య‌క్షుడిగా ఉన్న జ‌న‌సేన భీమ‌వ‌రం, గాజువాక‌లో ట‌ఫ్ పోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ సీట్ల‌ను గెలుపొందే అవ‌కాశం లేద‌ని నాగ‌న్న స‌ర్వే తేల్చింది. మ‌రి నాగ‌న్న స‌ర్వే ఎంత వ‌ర‌కు నిజ‌మో అన్న‌ది తెలియాలంటే మే 23న ఈవీఎంల నుంచి బ‌య‌ట‌కు రానున్న ఫ‌లితాల మీద ఆధార‌ప‌డి ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.

 

మామాట: నాగన్నా.. నీ గన్నుకు తిరుగులేదోచ్

Leave a Reply