జగన్, పీకే మధ్యలో విజయ్…తమిళనాడులో వింత పోస్టర్…

Share Icons:

చెన్నై: ఒకే పోస్టర్‌లో ఏపీ సీఎం జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తమిళ్ స్టార్ హీరో విజయ్‌లు కలిసి ఉంటే దాన్ని వింత అనే చెప్పాలి. అయితే ఆ వింత వెనుక కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. తమిళనాడులో కొందరు ఆకతాయిలు ఏర్పాటు చేసిన ఈ పోస్టుర్లు ఇప్పుడు తమిళ, తెలుగు రాష్ట్రాల  రాజీకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మధురై ప్రాంతంలో మగ్గురు ఫోటోలతో కలిపి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లో మధ్యలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కూర్చుండగా… ఓ పక్కనే జగన్, మరో పక్కనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు.

ఏపీని మేం కాపాడుకున్నాం… ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే కాపాడలంటూ… విజయ్ అభిమానులు కొందరు ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఈ మాట జగన్, పీకే కలిసి… విజయ్‌కు చెప్పినట్లుగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన బిగ్ పోస్టర్ హాట్ టాపిక్‌‌గా నడుస్తోంది. ఇదిలా ఉంటే తమిళ్ హీరో విజయ్‌పై ఇటీవలే ఐటీ దాడులు చేసింది. ఆయనకు నోటీసులు కూడా అందించింది. అయితే తమ అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఇప్పడు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించాలంటే హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే ప్రశాంత్ కిషోర్‌తో కలిసి రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడును కాపాడాలని విజయ్ అభిమానులు పోస్టర్లపై సందేశాలు ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో ఈ పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అక్కడ కూడా సూపర్ సక్సెస్ సాధించారు. అయితే ఆయన తమిళనాడులో స్టాలిన్ పార్టీ డీఎంకేతో కలిసి పనిచేస్తారని ఇప్పటికే కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీకి, విజయ్‌కు మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో… బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పీకే కూడా విజయ్‌ను మరో పొలిటికల్ స్టార్ చేస్తాడా అన్న చర్చ జరుగుతుంది.

 

Leave a Reply