అనుకున్నది సాధించడంలో జగన్ విజయం సాధించారా?

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

అమరావతి: మాట తప్పను.. మడం తిప్పను అనే నినాదంతో ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…అదే విధానంలో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు కాకమునుపే అనేక కీలక నిర్ణయాలని తీసుకుని సక్సెస్ అయ్యారు. అయితే తాను తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడంలో ఎన్ని విమర్శలు, ఎన్ని అవరోధాలు ఎదురైన జగన్ వెనక్కి తగ్గకుండా దూసుకెళుతున్నారు.

అందులో ముఖ్యంగా అధికారంలోకి రాగానే గత టీడీపీ ప్రభుత్వం పోలవరంలో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ…గత టెండర్లని రద్దు చేసి. రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. దీనిపై టీడీపీ, బీజేపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గలేదు. దీనిపై కోర్టులు కేసులు వేసిన తన పని తను చేసుకెళ్లిపోయారు. అయితే ఈ విషయంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. తాజాగా పోలవరం ప్రాజె‌క్ట్‌లోని 65 ప్యాకేజీల పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకే కోట్ అయ్యింది. దీంతో మొత్తం పని విలువలో రూ. 58 కోట్ల తక్కువకు హైదరాబాద్‌కు చెందిన మ్యాక్స్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్-1గా బిడ్ దాఖలు చేసింది.

గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని రూ.276 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన జగన్ సర్కార్ అదే పనికి రివర్స్ టెండరింగ్ ద్వారా మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా కేవలం రూ.300 కోట్లు విలువ చేసే పనిలోనే ఇంత ఆదా అయ్యిందంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్ వర్క్స్‌కి సంబంధించిన పనుల్లో చాలా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉంది.

కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారు కావడంతో దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అయ్యాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. మొత్తం మీద రూ.58.53 కోట్లు ఆదా అయినట్లు ఆయన చెప్పారు. ఇలా తొలి టెండర్ లోనే ఆదా చేసి జగన్ అనుకున్నది సాధించారు. భవిష్యత్ లో మరింత ఆదా చేసే అవకాశం ఉంది.

Leave a Reply