30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారం…

Share Icons:

అమరావతి, 24 మే:

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారని, ఆ రోజు మంత్రివర్గ విస్తరణ ఉండదని  వైసీపీ సీనియర్ నేత, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఈరోజ్ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేపు వైసీపీ శాసనసభా పక్షం సమావేశమై జగన్‌ను తమ నేతగా ఎన్నుకుంటారనీ చెప్పారు. అనంతరం తామంతా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుస్తామని చెప్పారు.

ఇక జగన్ ప్రమాణస్వీకార వేదికగా తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఎంచుకున్నారు. కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

మామాట: నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రి…

Leave a Reply