రమేశ్ కుమార్ ఫేక్ లెటర్‌పై జగన్ సీరియస్…డి‌జి‌పి విచారణ…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: సీఎం జగన్ ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చ నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తీవ్ర పదజాలంతో రాసిన.. ఆకాశరామన్న లేఖను జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు డీజీపీ సవాంగ్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మనీష్‌కుమార్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు.

ఇక నేరుగా డీజీపీ..నిఘా చీఫ్ తో అసలు ఈ లేఖ తాను రాయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేయటంతో..ఎక్కడి నుండి ఈ లేఖ వచ్చింది…ఎవరు ప్రచారంలోకి తెచ్చారనే అంశం పైన చర్చిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ పేరుతో తనకున్న విచక్షణాధికారాలకు కత్తెర వేసేలా ముఖ్యమంత్రి కొత్త వ్యూహం అమలుకు సిద్దమయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఓపెన్ గానే విమర్శించారు. ఆయన పైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవటంతో..కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పని చేసిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో..మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని..ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించిటం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

అయితే, నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉండటంతో.. చట్ట సవరణ ద్వారా మరో ఇద్దరు కమిషనర్లు నియమించటం..ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు సభ్యుల్లో మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కమిషనర్ గా నిమ్మగడ్డను కొనసాగిస్తేనే..నియమించే ఇద్దరు సభ్యుల్లో ఒకరిని చీఫ్ కమిషనర్ గా నియమించే అవకాశాల పైనా కసరత్తు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం

 

Leave a Reply