వైసీపీలోకి వంశీ లైన్ క్లియర్…వెంకట్రావుకు కీలక పదవి…ఉపఎన్నికల్లో..

vallabhaneni vamsi confirm to leave tdp and he not join in ysrcp
Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళేందుకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించిన వంశీ..వైసీపీకు మద్ధతు ఇస్తున్నాని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వైసీపీలోకి వెళ్ళేందుకు ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. ఇదిలా ఉంటే వంశీ వైసీపీలోకి వస్తే గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు భవిష్యత్తు ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు గందరగోళంలో పడిన నేపథ్యంలో సీఎం జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్ జిల్లా మంత్రులకు తన వద్దకు వెంకటరావును తీసుకురావాలని సూచించారు. దీంతో..జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొడాలి నాని..పేర్ని నాని ముఖ్యమంత్రి వద్దకు వెంకటరావును తీసుకెళ్లారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వద్ద వెంకటరావు రాజకీయ భవిష్యత్ మీద స్పష్టమైన హామీ లభించింది. జగన్ స్వయంగా హామీ ఇవ్వటంతో వెంకటరావు సైతం అంగీకరించినట్లుగా సమాచారం. అదే సమయంలో ముఖ్యమంత్రి గన్నవరం రాజకీయ వ్యవహారాల పైన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, మొత్తం వ్యవహారం ఇద్దరు మంత్రులు చూసుకుంటారని చెప్పినట్లుగా సమాచారం.

త్వరలోనే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో..వెంకటరావు సైతం సంతోషం వ్యక్తం చేసారు. దీంతో..ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ద్వారా అటు వల్లభేని వంశీ వైసీపీలో ఎంట్రీ..యార్లగడ్డ వెంటకరావుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమయ్యాయి. అదే సమావేశంలో వంశీ టీడీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతనే అధికారికంగా వైసీపీలో చేరుతారని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వంశీ స్వతంత్రంగా ఒక్కరే కూర్చుకుంటారని.. శాసనసభా సమావేశాల అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై నిర్ణయం తీసుకుంటారని ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు.. వంశీ రాజకీయంగా అడుగులు వేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఆయన పదవికి రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఉపఎన్నికలు రానున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున వల్లభనేని వంశీనే అభ్యర్ధిగా నిలబడనున్నారు. అలాగే టీడీపీ తరుపున గన్నవరంలో సరైన నాయకుడుని నిలిపేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ, బొండా ఉమా, గద్దె అనురాధాలతో ఓ కమిటీ వేశారు. అయితే గన్నవరం బాధ్యతలు గద్దె అనురాధాకు అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె ఉప ఎన్నికల్లో నిలబడతారని అంటున్నారు. చూడాలి మరి గన్నవరం రాజకీయాలు ఎలా మారుతాయో?

Leave a Reply