ట్రెండ్‌సెట్టర్: కేసీఆర్‌ కూడా జగన్‌ని ఫాలో అవుతున్నారు….

Share Icons:

అమరావతి: నేటితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి పది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పలు అంశాలను వివరించింది. ఏపీలో వైఎస్‌ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారని, ఆయనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రలు అనుసరిస్తున్నారని తెలిపింది. ఆయనో ట్రెండ్‌ సెట్టర్‌ అని పేర్కొంది.

సీఎం జగన్‌ ఏపీలోని ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చిన ‘ఇంగ్లిష్‌ మీడియం’ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారని పేర్కొంది. అధికార వికేంద్రీకరణను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అనుసరించాలనుకుంటున్నారని తెలిపింది. దిశ చట్టం గురించి తెలపమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కోరారని పేర్కొంది. దిశ అమలు చట్టాన్ని అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల ఏర్పాటు కోసం ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ , జార్ఖండ్ సీఎం హేమంత్‌ సొరేన్‌ ఆలోచిస్తున్నారని గుర్తు చేసింది.

అలాగే ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 9 ఏళ్లు పూర్తి చేసుకుని, 10వ సంవ‌త్స‌రంలోకి అడుగిడుతున్న సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, నాయ‌కులంద‌రికీ  పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’ అని పేర్కొంది.

ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరిపేందుకు వైకాపా శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. కాగా, వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరు కలిసి వచ్చేలా కే శివకుమార్ అనే వ్యక్తి ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే దానికి జగన్ అధినేత అయ్యారు. తండ్రి పేరు కలిసి వచ్చేలా ఉండటమే ఇందుకు కారణం. ఆపై 2014లో జరిగిన ఎన్నికల్లో ఒటమి పాలైనా, అలుపెరగక, 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, ప్రజలతో మమేకమై, తన ఆశయాన్ని సాధించుకున్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ చేపట్టి నేటికి తొమ్మిది సంవత్సరాలు నిండి పదో వత్సరం వచ్చేసింది. అంటే… ఇవి పార్టీ ఆవిర్భావ వేడుకలు. నేడు విశాఖపట్నంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

 

Leave a Reply