మరోసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్న జగన్ ప్రభుత్వం..

CM Jagan Mohan Reddy handover appointment order to a selected candidate in Vijayawada
Share Icons:

అమరావతి: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే నాలుగు ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతూ…గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరిట లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే మద్యం షాపులని ప్రభుత్వమే నడుపుతూ..అందులో కూడా నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. అయితే వీటిల్లో భర్తీ కాగా మిగిలిన పోస్టులకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే అన్ని శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీల భర్తీపై నివేదిక అందజేయడానికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వచ్చేనెల 30వ తేదీ నాటికి ఖాళీల భర్తీపై నివేదిక అందజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ సర్కులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి సంక్రాంతి పండుగకు ముందే ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

అటు పర్యాటక శాఖ, ఆ శాఖ పరిధిలోని పర్యాటకాభివృద్ధి సంస్థలో 70 శాతం వరకు కాంట్రాక్టు, క్యాజువల్ ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి శాఖల్లో దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేస్తారని అంటున్నారు. ఎక్సైజ్ శాఖకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ రాజ్, మున్సిపల్, పౌర సరఫరాలు, హోం వంటి శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి తొలి విడత నోటిఫికేషన్ వెలువడొచ్చని అంటున్నారు.

ఇక ఖాళీలు ఉన్న అన్నీ పోస్టులకు జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడిస్తే.. అదే నెలలో నియామక పరీక్షలను నిర్వహించనున్నారు. చివరి వారం నాటికి వాటి ఫలితాలను వెల్లడించి, ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగుల భర్తీని పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 40 రోజుల్లోనే నియామకాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొత్తానికి జగన్ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యని రూపుమాపేందుకు కష్టపడుతున్నారు.

 

 

Leave a Reply