హిందూ ధర్మ ప్రతినిధిగా గుర్తింపు కోసం జగన్ (వీడియో)

Share Icons:

హైదరాబాద్, జనవరి 12,

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవ మతానికి ప్రతినిధిగా ముద్ర వేశారు ప్రత్యర్ధులు. దానికి తగ్గట్లే ఎక్కువ క్రైస్తవ మత ప్రార్థనల్లో జగన్ పాల్గొన్న దృశ్యాలనే టిడిపి తన మీడియాలో ప్రచారం సాగించింది గత ఎన్నికల ముందు. పలువురి స్వామిజీలను తీసుకు వచ్చి హిందువులు వైసిపి వైపు చూడకుండా చేసేలా చేయాల్సినంత ప్రచారం నెగిటివ్ గా చేసింది తెలుగుదేశం. ఏ చిన్న అవకాశం దక్కినా జగన్ మతం పైనే ఫోకస్ పెడుతూ వైసీపీ వైపు చూస్తే క్రైస్తవం స్వీకరించేనట్లే అన్నంత అల్లరి సాగించారు. ఈ ప్రచారాలు నిజం అని నమ్మేలా వైఎస్ విజయమ్మ బైబిల్ చేతపట్టుకుని తిరగడం హిందువులు ఎంతోకొంత వైసిపికి దూరం నడిచేలా చేసింది.

తిరుమలలో స్వామివారి పట్ల విశ్వాసం ప్రకటించలేదంటూ ఇలా నానా యాగీ సాగింది. 2014 ఎన్నికల్లో ఇలాంటివన్నీ వైసీపీకి అధికారాన్ని దూరం చేసేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ కాంగ్రెస్ లో ఉండటం ఆయన ఏప్పుడూ కులమత ప్రచారాలకు అతీతంగా వ్యవహరించడం ఆయనకు బాగా కలిసి వచ్చాయి. కానీ జగన్ కి మాత్రం ప్రత్యర్ధులు అన్నీ అంటగట్టి దెబ్బ కొట్టారు.కోల్పోయిన చోటే వస్తువును వెతుక్కోవాలని అంటారు. జగన్ ఇప్పుడు అదే పని చేస్తూ వచ్చారు. రిషీకేష్ లో శారదాపీఠంలో యాగం నిర్వహించడంతో ప్రారంభమైన జగన్ ఆ తరువాత అన్ని మతాలపై తనకున్న విశ్వాసాన్ని అచంచలంగా ప్రకటిస్తూ వచ్చారు. తన పాదయాత్రను తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు.

ఇచ్ఛాపురం వరకు 13 జిల్లాల వరకు 3648 కిలోమీటర్ల చారిత్రక యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు జగన్. శ్రీనివాసుని ముందు ఉక్కు సంకల్పం తీసుకుని పాదయాత్ర ఆరంభించిన జగన్ తన యాత్ర ముగిసాకా తిరిగి శ్రీవారిని దర్శించుకున్నారు. అదీ అలిపిరి నుంచి కాలినడకన సామాన్య భక్తుడిలా వెళ్లి గోవిందుడి సన్నిధికి వెళ్లారు. మెట్లు ఎక్కే ముందు వాటిని దణ్ణం పెట్టుకోవడం, మార్గమధ్యంలో ఆంజనేయునికి కొబ్బరికాయ కొట్టడం దర్శనం అనంతరం విశాఖ శారదాపీఠం వెళ్లి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు తీసుకోవడం జరిగిపోయాయి.శ్రీవారి దర్శనం తరువాత అక్కడే రాత్రికి బస చేసి తిరిగి ఇడుపులపాయ చేరుకొని వైఎస్ సమాధికి నివాళి అర్పించి పులివెందుల చర్చి ప్రార్థనల్లో పాల్గొని కడప లోని ప్రఖ్యాత దర్గాలో సందర్శిస్తున్నారు జగన్.

ఇలా అన్ని మతాల పట్ల విశ్వాసం ప్రకటించి ప్రత్యర్ధులు తనపై వేస్తున్న మతం ముద్రను తుడుచుకునే ప్రయత్నం గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ అధినేత ప్రయత్నం చేయడం మరోసారి చర్చకు తెరలేపింది. వచ్చే ఎన్నికలు కీలమైన తరుణంలో జగన్ తన జాగ్రత్తలో తాను ఉండటంతో ఇప్పుడు టీడీపీ వ్యూహం ఎలా వుండబోతుందో అని ఎదురు చూస్తుంది వైసీపీ.

 

మామాట: మతాలు, యాగాలు, మొక్కులు, ఓట్లు కురిపిస్తాయా … ఏమో

Leave a Reply