ఆ విషయంలో తండ్రినే ఫాలో అవుతున్న జగన్…

Share Icons:

అమరావతి, 12 జూన్:

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పాలన పరమైన వ్యవహారాల్లో జగన్ మునిగితేలుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గం ఏర్పాటు చేసి…కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్….మరో సరికొత్త ఆలోచన చేస్తున్నారు.

తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ లానే…జగన్ కూడా ప్రజాదర్బార్ నిర్వహించాలని అనుకుంటున్నారు. 2004 నుంచి 2009లో చనిపోయేవరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.

రోజూ సెక్రటేరియట్ కు వెళ్లేముందు తన క్యాంపు ఆఫీసు దగ్గర వేర్వేరు సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను కలిసేవారు. వారి నుంచి అర్జీలు, దరఖాస్తులను స్వయంగా తీసుకునేవారు. ఆయా అర్జీలను సాయంత్రానికల్లా పరిష్కరించేలా జిల్లాల కలెక్టర్లు, అధికారులను పరుగులు పెట్టించేవారు.

ఇప్పుడు జగన్ కూడా తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ తరహాలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటివారం నుంచి రోజూ ఉదయం అరగంట చొప్పున ప్రజలను కలుసుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీనయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తగిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు వెల్లడించాయి.

 

Leave a Reply