ఆ ముగ్గురుకు ఎమ్మెల్సీ పదవులు ఖాయం చేసిన జగన్…

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

 

అమరావతి:

 

మొన్నటివరకు ఎమ్మెల్సీలు గా ఉన్న కరణం బలరామ్, ఆళ్ళ నాని, కొలగట్ల వీరభద్రస్వామిలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో మూడు స్థానాలు ఖాళీలు అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే కోటా నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా నేత చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను జగన్ ఖరారు చేశారు.

 

ఇప్పటికే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో… ఈ మూడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. మరోవైపు, ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో జగన్ సంప్రదింపులు జరిపారు.

 

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల 15, గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళుతున్నారు. 15న విజయవాడ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆయన, అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని, రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్నారు. తిరిగి 24వ తేదీ రాత్రి తాడేపల్లికి తిరిగి వస్తారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

 

Leave a Reply