దగ్గుబాటి టైమ్ ఔట్: వైసీపీలో ఉంటారా? బయటకు వెళ్లతారా?

jagan conditions to daggubati venkateswararao.
Share Icons:

హైదరాబాద్: దగ్గుబాటి వెంకటేశ్వరరావు…తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సీనియర్ నేత. దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు, మాజీ సీఎం చంద్రబాబు తోడల్లుడు. ఒకప్పుడు రాజకీయాలని శాసించిన దగ్గుబాటి..ఇప్పుడురాజకీయాల్లో ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన..ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా ఉండటలేదు. నియోజకవర్గంలో పార్టీని గాలికొదిలేశారు.

దీంతో దగ్గుబాటిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. పైగా దగ్గుబాటి భార్య, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బీజేపీలో ఉండి…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇది కూడా జగన్ కు నచ్చట్లేదు. దీంతో దగ్గుబాటి కుటుంబం ఉంటే ఒకేపార్టీలో ఉండాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దగ్గుబాటి వైసీపీలో ఉంటే, ఆయన భార్య బీజేపీలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో పురంధేశ్వరి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే జగన్ అప్పట్లోనే భర్త వైసీపీలో , భార్య బీజేపీలో ఉంటె బాగోదని సూచించారు. ఇక వీరు రెండు పార్టీల్లో ఉండటంపై పలు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు.

కానీ దగ్గుపాటి ఫ్యామిలీలో పురంధరేశ్వరి బీజేపీలోనే, దగ్గుపాటి, ఆయన కుమారుడు ఇద్దరూ వైసీపీలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ , గత ఎన్నికల్లో ఓటమిపాలు కావటంతో ఇప్పుడు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని అదే పార్టీలో ఫ్యామిలీ కొనసాగాలని జగన్ దగ్గుపాటిపై ఒత్తిడి తెస్తోన్నారు. పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని భావిస్తున్నవైసీపీ, ఆమెను సైతం వైసీపీ తీర్ధం పుచ్చుకునేలా చెయ్యాలని దగ్గుపాటిని కోరుతుంది

పైగా దగ్గుబాటి ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదు. అటు పురంధరేశ్వరి జగన్ సీఎం అయిన తరువాత, ఏపీ సర్కారుపైనా, జగన్ పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ తీరు జగన్ పార్టీ నేతలకు ఏ మాత్రం నచ్చటం లేదు. అందుకే ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని అంటున్నారు. కానీ పురాధేశ్వరి జాతీయ పార్టీ బీజేపీని వదిలేసి వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదు. పురంధేశ్వరికి కేంద్రం కూడా మంచి పదవి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో దగ్గుబాటి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడమే బెటర్ అని కార్యకర్తలు సూచిస్తున్నారు. అయితే దగ్గుబాటికి సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన పార్టీ మార్పుపై ఏదొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

Leave a Reply