టీడీపీకి చెక్ పెట్టేలా జగన్ వ్యూహం..మూడు రాజధానులకు మద్ధతుగా…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులని అమలు చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అమరావతినే రాజధానిగా ఉండాలని టీడీపీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఏపీలో అనిశ్చితి వచ్చింది. 50 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. అంతే కాదు రాజధానిగా అమరావతినే కొనసాగాలని భావిస్తున్న రైతులు రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల నుండి కూడా అమరావతి కోసం మద్దతు కూడగడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో సీఎం జగన్ తాజాగా మరో వ్యూహానికి సిద్ధం అయ్యారు.

ఈ క్రమంలోనే అమరావతి విషయంలో పోరాటం చేస్తున్న ప్రతిపక్ష టీడీపీని కట్టడి చేసేందుకు సీఎం జగన్ ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో , మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను , నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు . దీనికి సంబంధించి నేటి నుంచే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

విభిన్న కార్యక్రమాల ద్వారా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు సాధించాలని సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించనున్నారు .ఇక రేపు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుతూ వైసీపీ శ్రేణులు పూజలు చేయనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 12వ తేదీన వంటా వార్పు కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన రిలే నిరాహార దీక్షలు ద్వారా మూడు రాజధానులకు ప్రజల మద్దతు కూడగట్టనున్నారు ఫిబ్రవరి 14వ తేదీన గులాబీ పూలతో కలిపి మూడు రాజధానుల ఆవశ్యకతను తెలిపే కరపత్రాల పంపిణీ చెయ్యనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత నిర్వహించనున్నారు.

 

Leave a Reply