బాయ్‌ఫ్రెండ్‌తో రూ. 175 కోట్ల బంగ్లాలో సహజీవనం…

Share Icons:

శ్రీలంకన్‌ బ్యూటీ, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ హిందీ దర్శకుడితో ప్రేమలో పడిందని టాక్‌. అంతేకాదు… తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబైలో రూ. 175 కోట్ల విలువ చేసే బంగ్లాలో సహజీవనం చేయనున్నారట. బాలీవుడ్‌ కథనాల ప్రకారం జాక్వెలిన్‌ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేశారట. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించడానికి ఒక ఫ్రెంచ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ను కూడా ఖరారు చేశారట.

జాక్వెలిన్‌ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్‌ ఖాన్‌తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్‌ఫుల్‌ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్‌ ఖాన్‌తో ఆమె డేటింగ్‌ చేశారని, 2013లో బ్రేకప్‌ అయ్యారని టాక్‌. అయితే ఆ బ్రేకప్‌కి ఇద్దరూ ఫుల్‌స్టాప్‌ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్‌ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్‌ బాయ్‌’కి జాక్వెలిన్‌ డ్యాన్స్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply