జబర్దస్త్‌లో నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేది వీరేనా?

nagababu and three teams out of jabardasth program
Share Icons:

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. ఆ షో నుంచి నాగబాబు బయటకు వెళ్ళిపోయారు. ఆయనతో పాటు మరికొందరు టీం లీడర్లు కూడా బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగబాబు స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకోవాలని చూస్తున్నారు. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు లేకుండానే రోజాతోనే కంటిన్యూ చేయాలని ముందుగా షో నిర్వాహకులు భావించారు.

కానీ ఆయన ప్లేస్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను జడ్జ్‌గా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలను తనదైన యాంకరింగ్‌తో విజయ తీరాలకు చేర్చని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. సాయి కుమార్‌‌తో పాటు ఆలీని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ షో నుండి అనసూయ కూడా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో రష్మీ కూడా ఈ షో నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక హైపర్ ఆది జబర్ధస్త్ షో నుండి బయటకు వద్దామనుకున్నా.. లీగల్ సమస్యలతో ఆగిపోయాడు. మొత్తానికి జబర్ధస్త్ షో నుండి ఒక్కొక్కరుగా నిష్క్ర మించడం చూస్తుంటే.. త్వరలో జబర్ధస్త్ భవిష్యత్తు ఏమైవుతుందో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక వేరే చానెల్‌లో ప్రారంభం కానున్న మరో కామెడీ షోలో నాగ బాబు ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటు అనసూయ, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు ఆ షోలో సందడి చేయనున్నట్లు వారు విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. అందులో జబర్దస్త్‌పై కంటెస్టెంట్లు బాగానే పంచ్‌లు వేశారు. అందరిలో కెల్లా ఆర్పీ, వేణు వండర్స్ పంచ్‌లు బాగానే పేలాయి.

కొత్తింటికి వచ్చాము కదా అన్నీ బాగానే ఉంటాయి.. ఇదే నా జీ..వితం అంటూ పరోక్షంగా చానెల్‌పై తన ప్రేమను ప్రకటించాడు ఆర్పీ. ఇక వేణు సైతం నాగబాబు భవిష్యత్తు గురించి ముందుగానే చెప్పినట్లు, అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు.. మీతో పాటు ముగ్గురిని తీసుకొస్తారని చెప్పానా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా జబర్దస్త్‌ను వీడటం గురించి పంచ్‌లు వేశాడు.

Leave a Reply