ఐవైఆర్. కృష్ణారావు-ప్రశ్నలు-సమాధానాలు

Share Icons:

పదవి మత్తుమందు వంటిది. అది పచ్చకామర్ల వంటిది కూడా, లోకమంతా పచ్చగా ఉన్నట్టు కనిపింపజేస్తుంది. ఇది పాలకులకు అన్నిరకాలుగానూ నష్టం కలిగించే అంశం. అధికారంలో ఉన్నవారు తన కిందివారిని నమ్మాలి, నమ్మినట్టు కనిపించాలి. ఇతరులు చెప్పేవి వినాలి. వినినట్టు కనిపించాలి. స్వంతనిర్ణయాలు తీసుకోవాలి.

[pinpoll id=”66361″]

 

పరిపాలనలో ఉండేవారు బెల్లం వంటి వారు. వారి చుట్టూ స్వార్థపరులైన చీమలు చాలా చేరుతుంటాయి. అలాంటపుడు వారు మమరింత ప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పెద్ద అధికారిగా పనిచేసిన కృష్ణారావు తన పదవీ విరమణ తరువాత ఇపుడు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలతో ఏకంగా పుస్తకం కూడా ముద్రించారు. ఆ పుస్తకంలోని విషయాలు సాక్షి దినపత్రిక వరుసగా ప్రచురిస్తోంది. అవి చదువుతున్నవారికి చంద్రబాబు పరిపాలనా తీరు తెన్నులపై అనుమానాలు కలగడం సహజం.

రాష్ట్రప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఏస్ అధికారికి చట్టం, నిబంధనల గురించి చెప్పనవసరం లేదు. మరి అన్నీతెలిసిన విద్యావంతుడు, మేధావి, మంచి అధికారిగా పేరున్న కృష్ణారావు తాను గతంలో పనిచేసిన ప్రభుత్వాధినేత గురించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.  అవి రాష్ట్రప్రజల మేలుతో ముడిపడి ఉన్నవి. వాటికి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో మీరు ఐవైఆర్ కృష్ణారువు ఆరోపణలను ఎంతవరకు విశ్వసిస్తున్నారో చెప్పగలరా..?

 

మామాట: ప్రభుత్వ అధికారులు గా పనిచేసినవారు ఇలా చేయవచ్చా…  

Leave a Reply