ఈ వార్త బోడి గుండుకి, మోకాలుకి లింకు లాగా ఉంది…

Share Icons:

అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అమరావతి రాజధాని అంశంతో పాటు పోలవరం పనులు జరగని కారణంగా ఆటోనగర్‌ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన.. ‘ఈ వార్త ఎందుకో పొసగడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ‘ఆటోనగర్‌’ అయినప్పటికీ కార్మికులు వలస బాట పట్టారని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా నాలుగు లక్షల మందికి ఆటోనగర్‌లో ఉపాధి లభించేదని, వాహనాల విడి భాగాల కోసం చాలా మంది ఇక్కడకు వచ్చే వారని, ఇప్పుడు దుకాణాలు ఖాళీ అవుతున్నాయని కథనంలో తెలిపారు. ఈ కథనంపై ఐవైఆర్ స్పందిస్తూ… ‘ఈ వార్త ఎందుకో పొసగడం లేదు. నాకు తెలిసి 1980 నుంచి ఆటో నగరం విజయవాడలో కోట్ల వ్యాపారం చేస్తూ ఉంది.

పోలవరం, అమరావతికి సంబంధం లేకుండా ఆటోనగర్ ఉంది. పోలవరం, అమరావతి వలన సిమెంటు స్టీల్ రంగాలు దెబ్బతిన్నాయి అంటే అర్థం ఉంది గాని ఆటో నగరానికి వాటికి లింకు పెట్టడం బోడి గుండు మోకాలు లింకు లాగా ఉంది’ అని విమర్శించారు.

అటు ఏ రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలన్న విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేస్తున్నా, ఎల్లో మీడియా మాత్రం, ఆ విషయంపై వివరణ ఇచ్చిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుపై దుష్ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, “రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారు. అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు. ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోంది. దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ గారిపై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణం” అని వ్యాఖ్యానించారు.

 

Leave a Reply