అతి తక్కువ ధరలో ఐటెల్ విజన్1 స్మార్ట్‌ఫోన్…

Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు ఐటెల్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఐటెల్‌ విజన్‌ 1ను భారత్‌లో విడుదల చేసింది. రూ.5,499 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో.. 6 ఇంచుల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 8, 0.08 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఎంఐ ఔట్‌డోర్‌ బ్లూటూత్‌ స్పీకర్‌

మొబైల్స్‌ తయారీదారు షియోమీ నూతనంగా ఎంఐ ఔట్‌డోర్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.1399 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. 20 గంటల వరకు ఈ స్పీకర్‌ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ అసిస్టెంట్లకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు.

శాంసంగ్‌ ఇయర్‌బడ్స్‌

శాంసంగ్‌ తన నూతన ఇయర్‌బడ్స్‌.. గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఇయర్‌బడ్స్‌కు గాను భారత్‌లో ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వీటిని మార్చి 6వ తేదీ నుంచి భారత్‌లో విక్రయించనున్నారు. రూ.11,990 ధరకు వీటిని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇక గెలాక్సీ ఎస్‌20 ఫోన్లను ప్రీ ఆర్డర్‌ చేసిన వారికి కేవలం రూ.1990కే ఈ ఇయర్‌బడ్స్‌ను అందివ్వనున్నారు. వీటిని బ్లూటూత్‌ 5.0 ద్వారా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇవి 22 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు.

గూగుల్‌ రీచార్జ్‌

దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ తాజాగా గూగుల్‌ రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. దీనికోసం వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్‌ సెర్చ్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జి అని సెర్చ్‌ చేసి రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఆప్షన్లలో మొబైల్‌ నంబర్‌, ఆపరేటర్‌, ప్లాన్‌ వివరాలను ఎంటర్‌ చేసి అక్కడి నుంచి నేరుగా తమ మొబైల్‌ను రీచార్జి చేసుకోవచ్చు. మొబిక్విక్‌, పేటీఎం, ఫ్రీచార్జ్‌, గూగుల్‌ పే తదితర పేమెంట్‌ ఆప్షన్లను గూగుల్‌ అందిస్తున్నది.

 

Leave a Reply