రేపిస్ట్‌లకు అది కోసేయాలి..జబర్దస్త్ రష్మీ

It should be cut - rapists- Jabardasth Rashmi
Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 22,

జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ తన అందంతోనే కాదు..సామాజిక స్పృహతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంది ఈ హాట్ యాంకర్. అన్యాయాలు, అఘాయిత్యాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అపర కాళీగా మారిపోతుంది.

తాజాగా బీహార్‌లో జరిగిన ఓ కీచక పర్వంపై స్పందించిన జబర్దస్త్  యాంకర్…రేపిస్ట్‌లను నరికి పారేయాలంటూ ట్వీట్ చేసింది. రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని రెచ్చిపోతూ అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల పురుషాంగాలను కోసేయాలి. లేదంటే ఒక్క రాత్రిలోనే స్త్రీ జాతి అంతరించిపోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి మహిళ విలువ తెలుస్తుంది.— రష్మీ

rashmi gautam@rashmigautam27

Every day a new case and even more horrific than the last time Chop there damn dicks off if that’s all there manhood stands for Or let the female species disappear overnight so they realise the importance of our existence

బీహార్‌లోని బాగల్‌పూర్ జిల్లాలో ఓ బాలికపై రేపిస్ట్‌లు యాసిడ్ దాడిచేశారు. 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లోకి శుక్రవారం నలుగురు కొంతమంది దుండగులు చొరబడ్డారు. బాలిక తల్లిని గన్‌తో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేయబోయారు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. ఘటనపై కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

మామాట: చట్టాలు కఠినంగా ఉంటే చాలా… 

Leave a Reply