ఐటీ దాడులు..2వేల కోట్ల వ్యవహారం…బాబుపై వైసీపీ ఫైర్..

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: వారం రోజుల పాటు జరిగిన ఐటీ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. 2000 కోట్లు దొరికాయని.. ఈ పరిణామాలు చూస్తుంటే బాబు దోపిడీ రూ. లక్ష కోట్లకు చేరిందనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది చిన్న తీగ మాత్రమేనని… పూర్తి విచారణ జరిగితే చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల బాగోతం బయటపడుతుందని పేర్కొన్నారు.

కాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నంతో పాటు పుణె సహా 40 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో… మొత్తంగా 2 వేల కోట్ల రూపాయల మేరకు అక్రమంగా తరలించినట్లుగా ఐటీ శాఖ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి… తాజా పరిణామాలతో అంతర్జాతీయ నేరస్తులతో బాబుకు సంబంధాలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోందన్నారు.

చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పడు నిజమవుతున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో విచారణను తప్పించుకునేందుకే కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. నిత్యం మీడియా సమావేశాలు పెట్టి హడావిడి చేసే చంద్రబాబు.. ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ కార్యదర్శికి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నించారు. మాజీ కార్యదర్శి శ్రీనివాస్‌తోపాటు టీడీపీ నేతల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు అండ్‌ కో రూ. 2 వేల కోట్లు దోపిడి చేసి టీడీపీ నేతలు కిక్కురుమనడం లేదని  విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. టీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి రూ.2 వేల కోట్ల స్కాం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్కాం వివరాలు బయటపడ్డాక చంద్రబాబు, లోకేష్‌ నోర్లు మూత పడ్డాయా అని నిలదీశారు

 

Leave a Reply