ఐటీ ఎటాక్: చంద్రబాబు మాజీ పి‌ఎస్ ఇల్లు, ఆఫీసుల్లో కొనసాగుతున్న సోదాలు…

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఇళ్లు కార్యాలయాలపై రెండురోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి పలు కీలక డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీనివాసరావు 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు పీఎస్‌గా పనిచేశారు. ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం రూ.150 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాలపై విజయవాడ పరిధిలోని మాచవరం పోలీసులు ఆరాతీశారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్టు సీఆర్పీఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. కానీ పోలీసులను కూడా వారు లోపలికి అనుమతించ లేదు

బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరోవైపు మాదాపూర్‌లోని డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాని నరేన్‌ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) హైదరాబాద్ కార్యాలయంలో ఐటీ సోదారులు ఈ ఉదయం ముగిశాయి. పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న శ్రీనివాసులరెడ్డి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసులరెడ్డి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు.

 

Leave a Reply