అమెరికా హెచ్చరికలని పక్కనబెట్టి… ఇజ్రాయెల్‌తో భారత్ ఒప్పందం

Israel to supply missile defence systems to India for $777 million
Share Icons:

ఢిల్లీ, 25 అక్టోబర్:

అమెరికా హెచ్చరికలని పక్కనబెట్టి ఇజ్రాయెల్‌తో భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.5,683 కోట్ల విలువ చేసే శక్తిమంతమైన బరాక్‌–8 క్షిపణులను భారత్‌కు ఇజ్రాయెల్‌ అందించబోతోంది. ఈ మేరకు రక్షణ పరికరాలు తయారుచేసే ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇవి భూతలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణులు. ఈ క్షిపణులు కనుక భారత అమ్ములపొదిలోకి చేరితే భారత నేవీ మరింత బలోపేతం అవుతుందని డైరెక్టర్, సొసైటీ ఫర్ స్టడీస్ కమోడర్ సి.ఉదయ్ భాస్కర్ (రిటైర్డ్) తెలిపారు. ఈ క్షిపణి వ్యవస్థను ఏడు నౌకలకు అమర్చవచ్చని వివరించారు.

గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇక ఈ ఒప్పందంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)ను ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో చేర్చింది.

కాగా, ఆయుధాల సరఫరాలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానం ఇజ్రాయెల్‌దే. ఇండియన్ మిలటరీ నుంచి ఇజ్రాయెల్ ఇప్పటికే ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

మామాట: మరి ఈ ఒప్పందంపై అమెరికా ఎలా స్పందిస్తుందో..

Leave a Reply