ఇస్మార్ట్ కలెక్షన్లతో ముగిసిన ‘ఇస్మార్ట్ శంకర్’

ram ismart shankar first day collections
Share Icons:

హైదరాబాద్:

 

ఈ ఏడాది మరో డబుల్ బ్లాక్ బస్టర్  చిత్రం టాలీవుడ్ ఖాతాలో పడింది. రామ్ హీరోగా, పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ అదిరిపోయే కలెక్షన్లని సాధించింది. ఇప్పటికే సినిమా వచ్చి నెల రోజులు కావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వస్తున్నాయి. ఫుల్ రన్‌లో ఈ చిత్రం 37.50 కోట్లు షేర్ వ‌సూలు చేసి ఔరా అనిపించింది. డియర్ కామ్రేడ్‌తో పాటు మరిన్ని సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు తగ్గలేదు. రామ్ కెరీర్‌లో తొలిసారి 75 కోట్ల గ్రాస్ మైలురాయి అందుకున్న సినిమా ఇదే.

 

టెంప‌ర్ త‌ర్వాత స‌రైన విజ‌యం లేక చూస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఈ చిత్రం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే తీసుకొస్తుంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంక‌ర్ ఫుల్ రన్‌లో 37.50 కోట్లు వ‌సూలు చేసింది.  అస‌లు మాస్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ఈ చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 16.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆంధ్రలో మరో 17 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా ఏపీ తెలంగాణలో 55 కోట్లకు పైగా గ్రాస్.. 34 కోట్ల షేర్ వసూలు చేసింది.

 

నిజానికి సినిమాలో ఏం లేక‌పోయినా కూడా మాస్ డైలాగులు.. పూరీ మార్క్ ఆటిట్యూడ్.. దీనికి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలిచాయి. ఇక రామ్ కూడా ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌కు ప్రాణం పోసాడు. హీరోయిన్ల గ్లామ‌ర్ షో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.

 

Leave a Reply