ఆదోని మళ్ళీ వైసీపీదేనా…

Share Icons:

కర్నూలు, 13 మార్చి:

ఎన్నికలకి ఇంకా నెలరోజులు కూడా లేకపోవడంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కర్నూలు ఆదోని రాజకీయం రసవత్తరంగా మారింది.

ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సాయి ప్రసాదరెడ్డి బరిలో ఉంటారు. ఆదోనిలో వైసీపీ బలంగా ఉండటంతో ఈసారి కూడా గెలుపు తనదేనని సాయి భావిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనపడుతుండటంతో సాయికి కలిసొస్తుందని అనుకుంటున్నారు.

మరోవైపు టీడీపీ నుండి మూడుసార్లు ఓడిపోయిన మీనాక్షి నాయుడు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ టిడిపిలో చేరిన ఎంపి బుట్టా రేణుకకు కర్నూలు లోక్‌సభ సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో…ఆమెకు ఆదోని టిడిపి టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎంపి బుట్టారేణుక అవసరమైతే ఎమ్మిగనూరు నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతానే తప్పా ఆదోని నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆదోనిలో నిలిస్తే తనకు స్థానిక నాయకుల నుంచి సహకారమందుతుందో లేదోనని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మీనాక్షినాయుడు కుటుంబం మాత్రం తమకే సీటు ఇస్తుందని ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు.

అటు జనసేన తరుపున మల్లప్ప నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనసేన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. జనంలో దూసుకుపోతుండటంతో పార్టీ రోజురోజుకు బలోపేత మవుతోంది. ఇక ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండటంతో వారు గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

మామాట: మరి చూడాలి ఆదోనిలో మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుందో లేదో

Leave a Reply