ఆళ్ళగడ్డలో అఖిలకి వైసీపీ చెక్ పెడుతుందా…?

Share Icons:

కర్నూలు, 14 మార్చి: 

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం రసవత్తరంగా మారింది. భూమా నాగిరెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న ఆళ్లగడ్డలో రాబోయే ఎన్నికల్లో ఎవరి జెండా ఎగురుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శోభానాగిరెడ్డి మరణంతో భూమా అఖిలప్రియ రాజకీయ అరంగ్రేటం చేశారు.  వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే నాగిరెడ్డి మృతి చెందడంతో మంత్రివర్గంలో స్థానం లభించింది.

ఇక ఈ సారి ఎన్నికల్లో కూడా అఖిలనే మళ్ళీ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన మంత్రి ఇంటింటికి తిరుగుతూ…ఓటు తనకు కాదు…శోభా నాగిరెడ్డికి వేయాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది.

అటు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు బిజేంద్రనాథ రెడ్డి పోటీ చేయనున్నారు. భూమా, గంగుల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్ధాలుగా కక్షలు ఉన్నాయ. ఇక్కడ వైసీపీ బలంగా ఉండటంతో తన గెలుపు సులువని బిజేంద్ర భావిస్తున్నారు. అలాగే ఆళ్లగడ్డలో జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆర్ కె రామక్రిష్ణ ప్రయత్నిస్తున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న రామక్రిష్ణకు కాపు సామాజికవర్గం మద్దతు లభించే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గలో బలిజ కులం ఓటర్లు 40 వేల మంది ఉన్నారు. యాదవ ఓటర్లు 31 వేల మంది ఉన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా ఈ రెండు సామాజిక వర్గాలదే కీలకపాత్ర. బలిజ ఓటర్లు గత కొన్నేళ్లుగా భూమా కుటుంబానికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది.

మామాట: మరి ఆళ్లగడ్డలో ఈసారి ఆధిపత్యం ఎవరిదో

Leave a Reply