బీజేపీతో టీఆర్ఎస్ జతకట్టనుందా..?

బీజేపీతో టీఆర్ఎస్ జతకట్టనుందా..?
Views:
11

హైదరాబాద్, 10 ఆగష్టు:

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు టీడీపీతో జట్టుకట్టి వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే… మరోవైపు ఎన్నికల తర్వాత బీజేపీకి మద్ధతు ఇచ్చే దిశగా టీఆర్ఎస్  వ్యూహాలు పన్నుతోంది.

కాంగ్రెస్-టీడీపీ పొత్తు విషయం పక్కన పెడితే… ఇటీవల కాలంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మోదీకి చాలా దగ్గరగా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వీరి మధ్య స్నేహం చిగురిస్తుంది అనడానికి కూడా చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ సీఎం, అది నెరవేరాలంటే ఢిల్లీతో దగ్గరగా ఉండడమే బెటరనే అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.

అందులో భాగంగానే బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా కేంద్రం కొంత పెట్టుబడి పెడితే మిగిలినది మేం భరిస్తామనే ప్రతిపాదన తెచ్చారు. ఇక తెలంగాణ జోన్ల విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేసీఆర్ గొడవలు పెట్టుకోకుండా అభివృద్ధి మీద దృష్టిసారించారంటూ మోదీ అభినందించారు.

అయితే అవిశ్వాసంలో ఎవరికి ఓటు వేయకుండా తటస్థంగా ఉన్న గులాబీ దళం…రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో దిగిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతు పలికింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు హరివంశ్‌కు అనుకూలంగా ఓటేశారు.

అయితే, ఇది భవిష్యత్తులో కొత్త స్నేహానికి సంకేతమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామలన్నీ చూస్తుంటే ఎన్నికల ముందు కాకపోయిన…తర్వాతైనా బీజేపీతో టీఆర్ఎస్ జతకట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు. మరి చూడాలి వచ్చే ఎన్నికలు ఎలాంటి కొత్త మార్పులు సంభవిస్తాయో?

మామాట: ఏ నిమిషానికి ఏమి జరుగునో….ఇదే కదా నేటి రాజకీయం….

(Visited 17 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: