మామాట లో మీమాట పోల్ నెం.12 – కప్పల తక్కెడతో ఫెడరల్ ఫ్రంట్ సాధ్యమా..?

Share Icons:

దేశంలో గుణాత్మక మార్పులు తీసుకువస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రాలన్నీ తిరిగేస్తున్నారు.

[yop_poll id=”21″]

తను ఎప్పుడూ కలవని వాళ్లను కూడా కలిసేస్తున్నారు. కోల్‌కతా మొదలుకుని వీలైనన్ని రాష్ట్రాల లోని ప్రాంతీయ పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు. దేశంలో రాజకీయ మార్పులు తీసుకువచ్చే ఫెడరల్ ఫ్రంటు కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావడం అంత సులభమా? చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ఇటు అధికార పక్షమైనా, అటు ప్రతిపక్షమైనా సరే ప్రాంతీయ పార్టీలే ఉంటున్నాయి. ఇలాంటి స్థితిలో ఫెడరల్ ఫ్రంటు కోసం కేసీఆర్ పరుగులు పెట్టడంలో అర్థం ఏంటి? దేశంలో తమదే రాజ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టడం సాధ్యమా? ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. సాధ్యాసాధ్యాలను ఒక్కసారి చూద్దాం.

కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి నూకలు చెల్లిపోయాక కాంగ్రెస్ నేతృత్వంలో యు.పి.ఎ. బీజేపీ నేతృత్వంలో ఎన్.డి.ఎ.లు రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ, కేంద్రంలో జాతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. ఇప్పుడు కొంత మంది కేవలం ప్రాంతీయ పార్టీలతోలే ఒక కొత్త ఫ్రంటును తీసుకురావడానికి కంకణం కట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిశారు. దేశ రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. ఇక తమిళనాడులో డిఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. ఫెడరల్ ఫ్రంటు యొక్క ఆవశ్యకతపై చర్చించారు. తరువాత మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను కలిశారు. ఫెడరల్ ఫ్రంటుపై ఇద్దరు కలసి ఒక సంయుక్త ప్రకటన చేశారు. తాజాగా అఖిలేష్ యాదవ్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్‌తో కలసి చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంటుపై చర్చించారు.

[box bg=”#” color=”#” border=”#” radius=”15″ fontsize=”18″]ఫెడరల్ ప్రంటు సాధ్యమా?[/box]

మన దేశంలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు అంతరం బాగా ఉందన్న విషయంలో ఎటువంటి సందేహం  లేదు. జాతీయ పార్టీల నేతృత్వం లోని యూపిఏ, ఎన్డీయే కూటములలో కూడా ప్రాంతీయ పార్టీలే అధికంగా ఉంటున్నాయి. దేశంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. . సమన్వయ లోపం అనలేంకానీ, ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇష్టంలేని  అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నిజాయితీగా రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ తరువాత చంద్రశేఖర్, విపిసింగ్, ఐకే గుజరాల్, దేవెగౌడల ప్రభుత్వాలన్నీ మైనారిటీ ప్రభుత్వాలే. ప్రమాదపుటంచున నడిచిన ప్రభుత్వాలే. తరువాత వచ్చిన వాటిలో చాలా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి మెజారిటీ కలిగిన బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

ఇప్పుడీ ఫెడరల్ ఫ్రంటు ప్రయోగమేమైనా కొత్తదా? అంటే, చరిత్రను తిరగదోడినప్పుడు  కాదనే జవాబు వస్తుంది. చాలా మార్లు ప్రాంతీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. కానీ దానికి కూడా జాతీయ పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. జాతీయ పార్టీలు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పడు ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పని సరి అయ్యింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్, బీజేపీలు లేకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సాధ్యమా? దేశ వ్యాప్తంగా 545 పార్లమెంటు సీట్లు ఉంటే కనీసం 274 స్థానాలలో కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే విజయం సాధించాలి. ఇది సాధ్యం కాలేదా? అంటే,  కాంగ్రెస్, బీజేపీలు రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని స్థితిలో- చాలా తక్కువ సందర్భాలలో సాధ్యపడింది. అది 1989 నుంచి తరచు జరుగుతోంది. అయినా సరే ఆ పార్టీలన్నింటిని మూటకట్టేవాడెవ్వడు. చరిత్ర ప్రకారం చూస్తే ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందే కానీ, జాతీయ పార్టీల మద్దతు లేకుండా నిలువలేకపోయింది. ఇప్పుడు అది సాధ్యమా? అనేది వేయి డాలర్ల ప్రశ్న.

[box bg=”#” color=”#” border=”#” radius=”15″ fontsize=”18″]కప్పల తక్కెడతో ప్రభుత్వం సాధ్యమా?[/box]

కే.సి.ఆర్. కలలుగంటున్న ఫెడరల్ ఫ్రంటు ఏర్పాటు  సాధ్యమైనా, ప్రభుత్వం ఏర్పాటు రాజకీయ ఎండమావేననిపిస్తుంది. ఇది వరకే మనం చెప్పుకున్నట్లు 545 పార్లమెంటు సీట్లలో 274 సీట్లు సాధిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే విషయం స్పష్టం. ఏ ప్రభుత్వానికైనా ఇది మ్యాజిక్ ఫిగర్. ఇదే కీలకం. దీనిపై చర్చించే ముందు దక్షిణ భారతదేశ స్థితిగతులను పరిశీలిద్దాం. మొదట తెలంగాణనే తీసుకుందాం. ఇక్కడి రాజకీయ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నదే 17 ఎంపీ సీట్లు. వాటిని జాతీయ పార్టీలతో కలసి ప్రాంతీయ పార్టీలు పంచుకుంటాయి. రెండు నుంచి మూడు స్థానాలలో బీజేపీ దక్కించుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ హీన పరిస్థితులలో అంటే టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకున్నా సరే 4 నుంచి 5 సీట్లు సాధించుకునే అవకాశం ఉంది. మిగిలినవెన్ని? 9 సీట్లులో తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తే ఇక అంతే సంగతులు ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి మరో 4 సీట్లు పోయే అవకాశం ఉంటుంది. వీటిని కేసీఆర్ కలుపుకోలేరు. ఎందుకంటే ఆయన సిద్ధాంతమే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి కనుక. ఇక మిగిలిన 5 సీట్లలో మజ్లీస్ ఖచ్చితంగా ఒక సీటును సాధిస్తుంది. అంటే టీఆర్ ఎస్ కు ఐదు నుంచి 9 సీట్లు వస్తాయి. ఇక తెలుగుదేశం పార్టీ, వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన జనసమితులు ప్రాంతీయ పార్టీలుగా ఉంటున్నాయి. ఇవి కూడా ఒకటో రెండో సీట్లను సాధిస్తే వాటిని కలుపుకుపోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ తో తెలుగుదేశం, వైసీపీలు కలసే అవకాశం ఉందేమోగాని, టీజేఎస్ కలవదు.

ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని గమనిద్దాం. ఇక్కడ ప్రధానమైనవి ప్రాంతీయ పార్టీలే. తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు. ఇక్కడ 25 ఎంపీ స్థానాలుంటే తెలుగుదేశం, వైసీపీలు కాస్తంత ఎక్కువ సీట్లను సాధించుకుంటాయి. జనసేన కూడా చాలా చోట్ల గెలుపోటములను నిర్ణయిస్తూ, తాను రెండో మూడో ఎంపీ స్థానాలను సాధిస్తుందనుకుంటే, మిలిగిన స్థానాలను సాధారణ పరిస్థితులలో వైసీపీ, టీడీపిీలు అటుఇటుగా పంచుకోగలవు. గెలుపోటముల సంగతి అలా ఉంటే అసలు తెలుగుదేశం, వైసీపీలు ఒక వేదికపైకి వస్తాయా? ఎలా సాధ్యం? ప్రత్యేక హోదా విషయంలోనే కలసిరాని ఈ ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రంటు లోకి వచ్చే అవకాశమే లేదు.

ఇక తమిళనాడు విషయానికి వస్తే ఏఐఏడిఎం, డిఎంకే, ఇక దినకరణ్ ఏడిఎంకే, రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్ ఇలా కుప్పలుతెప్పలుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో బద్ధవైరుద్యం ఉన్న పార్టీలున్నాయి. వీటన్నింటిని ఒక చోటికి చేర్చి ఫెడరల్ ఫ్రంటును ఏర్పాటు చేయడం సాధ్యమా? తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా అయినా అవన్నీ ఒక వేదిక మీదికి వచ్చే అవకాశమే లేదు. ఇక కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే, ఇక్కడ 28 సీట్లు ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలది మేజర్ వాటానే, ఒక్క జెడిఎస్ దేవేగౌడ పార్టీ మినహా మిగిలిన పార్టీలు ఫెడరల్ ఫ్రంటులో కలిసే అవకాశం లేదు. అలాగే కేరళ రాష్ట్రంలో 20 ఎంపీ స్థానాలుంటే జాతీయ పార్టీలదే హవా… వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతుంటాయి. ఇక మహారాష్ట్రలో శివసేన, భజరంగదళ్, ఎసీపీలు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. బీజేపీని అంటుకుని రెండు పార్టీలు, కాంగ్రెస్ భావజాలంతో ఉన్న మరోపార్టీ అసలు ఫెడరల్ ఫ్రంటులో చేరుతాయా? ఇక ఉత్తర ప్రదేశ్ ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. 48 సీట్లున్న రాష్ట్రం ఇక్కడి విరుద్దమైన పార్టీలు బీఎస్పీ, ఎస్పీలు ఇవి రెండు సాధ్యమైనంత వరకూ ఒక వేదికపైకి రాకపోవచ్చు. ఇలా ఉంటే 274 మ్యాజిక్ ఫిగర్ ను సాధించడం సాధ్యమా..? ఫెడరల్ ఫ్రంటు ఏర్పడినా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమా? ఇలాంటప్పుడు గుణాత్మక మార్పు ఎలా సాధ్యం?

మామాట:- పాలకులు ఎవరైనా ‘గుణవంతులు’ అయివుంటే చాలు ‘గుణాత్మకమైన మార్పులు’ అవే చోటు చేసుకుంటాయి..

Leave a Reply